Dulquer Salmaan: మహానటి ప్రొమోషన్ కు అందుకే రాలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ లో సీతారామం మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరోలు సుమన్, దుల్కర్ సాల్మన్, హీరోయిన్ మృణాల్ పాల్గొన్నారు. అనంతరం వారు సీతారాం మూవీ సినిమా ముచ్చట్లు అభిమానులతో పంచుకున్నారు. హీరో దుల్కర్ సాల్మన్ మాట్లాడుతూ.. మా సినిమా హిట్ టాక్ విజయవాడలో ప్రారంభమౌతుందని ఆశిస్తున్నా అన్నారు. మహానటి సమయంలో నా కాలు ఫ్రాక్చర్ అయిందని, అందుకే ప్రొమోషన్ కు రాలేక పోయానని అన్నారు. సీతారామం చాలా పెద్ద క్లాసిక్ సినిమా అవుతుందని ఆనందం వ్యక్తం చేసారు. ఇక హీరో సుమంత్ మాట్లాడుతూ.. నా లైఫ్ లో మొదటిసారి కీలకమైన సహాయక పాత్ర చేస్తున్నఅని అన్నారు.
read also: Eatala-Komatireddy: ఈటల, కోమటిరెడ్డిలకు నిజంగా అంతుందా?. కేసీఆర్ పైన ఎందుకీ ఛాలెంజ్‌లు?
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈవిధమైన సపోర్టింగ్ రోల్ చేయడం నాకు గర్వంగా ఉందని అన్నారు. సినిమా స్క్రిప్ట్ బాగా నచ్చిందని, సపోర్టింగ్ రోల్ ట్రెండ్ సౌత్ లో వచ్చిందని అన్నారు. నటుడు అన్ని రోల్స్ చేయాలని మా తాత నాగేశ్వరరావు చెప్పారని గుర్తు చేసుకున్నారు. తను నట్టించిన గోదావరి మూవీ కంటే సీతారామం సినిమా క్లాసిక్ హిట్ కొడుతుందని బావిస్తున్నాని తెలిపారు. ఆగష్టు 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోందని అన్నారు. ఇక హీరోయిన్ మృణాల్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో తనని గుర్తు పెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసారు. దుర్గమ్మ దర్శనం చేసుకుని నా కెరీర్ ప్రారంభిస్తున్నానని అన్నారు. ఇక్కడ నుంచీ నా కెరీర్ ప్రారంభించడం సంతోషంగా వుందని పేర్కొన్నారు. సీతారామం సినిమాలో సీత.. క్యారెక్టర్ చాలా బాగుందని, వైజయంతి మూవీస్ నుంచీ కెరీర్ ప్రారంభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు. తెలుగు సినిమాలో చేస్తానని అనుకోలేదని హీరోయిన్ మృణాల్ ఈ సందర్భంగా తెలిపారు.
దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. ‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సున్నితమైన ప్రేమకథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ ‘సీతారామం’ సినిమాను నిర్మించారు. అయితే.. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో.. ఇప్పటికే అంచనాలు పెంచేసింది. కొద్ది రోజుల కిందట విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రేక్షకుల మంచి ఫీల్ గుడ్ మూవీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చేస్తుందనే ‘సీతా రామం’ చిత్రయూనిట్ అంటోంది.
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!