స్టార్ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరితో స్ర్కీన్ షేర్ చేసుకుంది. ప్రజంట్ వరుస సినిమాలు సీరీస్ లు చేస్తోంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా జరిగిన ఒక అవార్డు ఫంక్షన్‌లో సిమ్రాన్ తన కో యాక్టర్‌ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో వైరల్‌గా మారాయి.
Also Read: Malavika : టాలీవుడ్ డైరెక్టర్స్ పై యంగ్ బ్యూటీ సంచలన కామెంట్స్.
‘కొన్ని రోజుల క్రితం నాకు బాగా తెలిసిన తోటి నటి ఒక సినిమాలో చాలా బాగా నటించింది.. ఆ రోల్ చూసి ఆశ్చర్యపోయి మెసేజ్ పంపా. దానికి ఆమె వెంటనే స్పందించింది. ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ రిప్లై ఇచ్చింది. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు అనిపించింది. ఈ వేదికగా ఆమెకు నేను చెప్పేది ఒక్కటే. పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమం’ అని వారి ఇద్దరి మధ్య జరిగిన విషయం బయట పెట్టింది. దీంతో ఆవిడ ఎవరిని ఉద్దేశించి అన్నది అనే చర్చలు మొదలయ్యాయి.
అయితే కొందరు నటి జ్యోతిక అనుకున్నారు. ఎందుకంటే రీసెంట్‌గా ఆమె ‘డబ్బా కార్టెల్’ లో చేసింది కాబట్టి ఇన్‌డైరెక్ట్‌గా ఆమెనే అని ఉండోచ్చు అనే టాక్. ఇంకొందరు లైలా ని అనుకుంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె ఆది పినిశెట్టి ‘శబ్దం’ మూవీ లో తనకే మాత్రం సూటవ్వని నెగటివ్ షేడ్స్‌లో కనిపించింది. ఇంకో వర్గం స్నేహ గురించని మరో అనాలిసిస్ తీశారు. కానీ ఆమె ఇప్పుడు ముందులా యాక్టివ్‌గా లేదు. ఇలా రాసుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే కానీ సిమ్రాన్ అన్నది ఎవరినో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు.