ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న శృతిహాసన్ ఇప్పుడు పెద్దగా తెలుగు సినిమాలు చేయడం లేదు. చేస్తున్న కొన్ని సినిమాలతో వార్తలో నిలుస్తున్న ఆమె ఇప్పుడు అనుహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. అసలు విషయం ఏమిటంటే శృతిహాసన్ ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ హ్యాక్ అయింది. సుమారు ఎనిమిది మిలియన్ల నుండి ఫాలోవర్స్ ఉన్న ఆమె అకౌంట్ ని క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ బ్యాచ్ హ్యాక్ చేసింది. చేయడమే కాదు తమకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది.
Also Read:Samantha: సమంత ప్రాజెక్ట్ ఆగిపోయిందా?
భారీగా ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్ అకౌంట్లను టార్గెట్ గా చేసుకుని ఈ క్రిప్టో కరెన్సీ బ్యాచ్ హ్యాకింగ్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే శృతిహాసన్ కి సుమారు 7.8 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉండడంతో శృతిహాసన్ అకౌంటు మీద కన్నేశారు. ఇక చివరిగా తెలుగులో సాలార్ సినిమాలో కనిపించిన ఆమె ప్రస్తుతానికి తమిళ కూలీ, ట్రైన్, జననాయగన్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే సాలార్ సెకండ్ పార్ట్ లో కూడా ఆమె నటించబోతోంది.

Also Read:Venkatesh: ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టిన వెంకీ మామ?