బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలతో బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. అఖండ మొదలుకొని ఇటీవల వచ్చిన అఖండ 2 వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఇక ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్.. ఎన్బీకె 111 వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
Also Read : Nayanthara : ఓ వైపు డివోషనల్ ఫిల్మ్.. మరోవైపు యాక్షన్ ఎంటర్టైనర్స్
మాస్ యాక్షన్ అంశాలతో పాటు.. రెండు వేరు వేరు కాలాలకు చెందిన హిస్టారికల్ స్టోరీతో.. చరిత్రను, వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టుగా టాక్ ఉంది. ఒక రకంగా టైమ్ ట్రావెల్ లాంటి కథలా ఉంటుందని, బాలయ్యను మునుపెన్నడు చూడని పాత్రలో చూడబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో.. ఈ సినిమా కథ మారినట్టుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. హిస్టారికల్ కథను పక్కన పెట్టి మరో కొత్త కథతో సినిమాను చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. హిస్టారికల్ మూవీకి చాలా టైమ్ పడుతుందని, బడ్జెట్ కూడా భారీగా అవుతుందని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇప్పటికే గోపీచంద్, బాలయ్యకు మరో కొత్త లైన్‌ను వినిపించగా, ఆయన కూడా ఓకె చెప్పినట్టుగా టాక్. అయితే, మరో వెర్షన్ ప్రకారం.. బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని హిస్టారికల్ కథలోనే కొన్ని మార్పులు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. కథని రీ రైట్ చేశారని అంటున్నారు. అయినా కూడా, కథ మొత్తం మారిపోయిందని టాక్. అయితే, ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే!