ఈ వారం చిన్నా, చితకా అన్నీ కలిపి దాదాపుగా 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. అందులో దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కీలక పాత్రలలో నటించిన కాంత, సంతాన ప్రాప్తిరస్తు, లవ్ ఓటీపీ, గోపీ గాళ్ల గోవా ట్రిప్, జిగ్రీస్ లాంటి సినిమాలతో పాటు చిన్నాచితకా సినిమాలు మరికొన్ని ఉన్నాయి. శివ సినిమాతో పాటు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే సినిమా రీ-రిలీజ్ అయింది.
Also Read : Akhanda 2 : ఈ తరం పిల్లలతో సహా.. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ‘అఖండ 2’ : బాలకృష్ణ
అయితే, ఇన్ని కొత్త సినిమాలు వస్తే వాటిని పెద్దగా పట్టించుకోకుండా, శివ అనే సినిమా రీ-రిలీజ్‌కి థియేటర్లకు వెళ్లి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా నిలిచిన ఈ సినిమాని 36 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ చేస్తే, అప్పటి జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకునేందుకు అప్పటి తరం వారు, తాము అప్పటికీ పుట్టకపోయినా సినిమాని ఎంజాయ్ చేద్దామని ఈ జనరేషన్ వారు వెళ్లి సినిమాని ఆదరిస్తున్నారు. ‘కాంత’ సినిమా సహా ఏ సినిమాకి పూర్తిస్థాయి పాజిటివ్ టాక్ రాలేదు. ఈ నేపధ్యంలో ‘శివ’ సినిమాకి మాత్రం హౌస్ ఫుల్స్ పడుతున్నట్లుగా సమాచారం. ఈ లెక్కన కొత్త సినిమాలు పది రిలీజ్ అయినా సరే, ‘శివ’ రీ-రిలీజ్ సినిమాని మళ్లీ థియేటర్లో చూడడానికే ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు అని చెప్పవచ్చు.