టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన తెలుగులో ఎన్నో మంచి సినిమాలను అందించారు. చివరిగా లవ్ స్టోరీ సినిమా నాగచైతన్యతో చేసిన ఆయన ప్రస్తుతానికి ధనుష్, నాగార్జున హీరోలుగా కుబేర అనే సినిమా చేస్తున్నారు అయితే శేఖర్ కమ్ముల బ్రహ్మానందం కి అత్యంత సన్నిహితులైన బంధువని తాజాగా వెల్లడైంది. బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత మనవళ్ళుగా నటిస్తున్న బ్రహ్మ ఆనందం అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని బ్రహ్మానందం బయటపెట్టారు.
Brahmanandam: నాకు వేషాలు లేక.. ఇవ్వక కాదు.. అందుకే సినిమా చేయడం తగ్గించా!
శేఖర్ కమ్ముల కెరియర్ స్టార్టింగ్ లో గోదావరి సినిమా కథ రాజా గౌతమ్ కి చెబితే అది హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్టు లా ఉందని ఆయన కాదన్న విషయాన్ని వెల్లడిస్తూ ఈ సంగతి చెప్పుకొచ్చారు. శేఖర్ కమ్ములని తాను కమ్ముల శేఖర్ అని పిలుస్తానని ఎందుకంటే ఆయన తన భార్య మేనల్లుడు అని చెప్పుకొచ్చారు. అయితే అది వేరే విషయం అంటూ దాటవేయడం గమనార్హం. ఇక తెలుగులో మసూద, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సినిమాలు అందించిన రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఆరంగ్రేటం చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.