హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నిజజీవితంలో తండ్రీకొడుకులైన వీరు సినిమాలో మాత్రం తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఈ సినిమాకి RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ మూవీ నుంచి బ్రహ్మానందం టీజర్ రిలీజ్ చేశారు. ఇక అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బ్రహ్మానందం కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలు తగ్గించడంపై ఆయన స్పందించారు. ఎందుకు ఎక్కువ సెలక్టివ్ అయ్యారు అని అడిగితే నాకు ఇక్కడ ఒక అందమైన షాండిలియర్ లాంటి ఇమేజ్ ఉంది, దాన్ని రోజు శుభ్రం చేసుకుంటూ, నీట్ గా మైంటైన్ చేసుకోవడం వేరు. దాన్ని అలా వదిలేస్తే దుమ్ము పట్టేసి, బూజు కూడా పడుతుంది.
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దుండగుడి గుర్తింపు.. ఎలా ఇంట్లోకి వచ్చాడంటే..?
దీంతో ఇంతకు ముందు బాగుండేది రా బ్రహ్మానందం కామెడీ. ఈ మధ్య చేస్తున్నాడు కానీ నవ్వు రావడం లేదు, అని అంతకు ముందు పూర్వ కమెడియన్స్ దగ్గర ఈ మాట విన్నాను. ఎంత చేసినా ఇంకా ఎదో వెతుకుతున్నారు. దానికి తోడు వయస్సు, ఇప్పుడు రంగు వేశాను కానీ లేదంటే ఈజీగా అర్ధమవుతుంది. వయసుని మనం యాక్సెప్ట్ చేయాలి, లేదంటే కుదరదు. ఇంతకు ముందు చేసినంత యాక్టివ్ గా చేయలేకపోతున్నాను అని కూడా నాకు తెలుసు. నాకు వేషాలు లేక కాదు, ఇవ్వక కాదు, నేను చేయాలేకా కాదు. నేను చేసిన కామెడీనే చేస్తున్నాడు అనే ఇమేజ్ వద్దనుకుని సినిమాలు చేయడం తగ్గించాను అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఇక ఈ బ్రహ్మానందం సినిమాలో రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని. ఐశ్వర్య హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలలో నటిస్తున్నారు.