Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.

Dimple Love U

Dimple Love U

యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తాజాగా నిర్వహించిన ‘భోగి’ మ్యూజికల్ నైట్‌లో ‘గంగ’ పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో శర్వానంద్ చేసిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్ డింపుల్ హయాతి గురించి స్టేజ్ పైనే ఆయన చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వేదికపై మాట్లాడుతున్న క్రమంలో హీరోయిన్ డింపుల్ హయాతి ప్రస్తావన రాగానే శర్వానంద్ ఎంతో ఆత్మీయంగా స్పందించారు. “డింపుల్.. లవ్ యూ ఆల్వేస్!”*అంటూ అందరి ముందు ఓపెన్‌గా చెప్పేయడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా చప్పట్లతో హోరెత్తించారు. ఆమె గురించి మాట్లాడుతూ.. “డింపుల్‌ను చూస్తేనే ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. తను సెట్‌లోకి రాగానే చుట్టుపక్కల అదొక అద్భుతమైన ఆరా క్రియేట్ అవుతుంది. అందరినీ ఎంతో కంఫర్టబుల్‌గా ఉంచుతుంది. ఆ అమ్మాయిలో ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీని ఎలా తీసుకోవాలో నేను కూడా నేర్చుకోవాలి” అంటూ డింపుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ వేడుకకు హాజరు కాలేకపోయిన మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి కూడా శర్వా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ఈ సినిమాలో నాది, అనుపమది చాలా అద్భుతమైన లవ్ స్టోరీ. గత 15, 20 ఏళ్లలో నేనైతే ఇలాంటి ప్రేమకథను చూడలేదు. పైకి లవ్ స్టోరీలా కనిపించదు కానీ, అంత అండర్ కరెంట్‌గా సంపత్ దాన్ని రాసిన తీరు చూసి సినిమా చూస్తున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను” అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం తాను పడ్డ శ్రమ గురించి చెబుతూ శర్వానంద్ కాస్త ఎమోషనల్ అయ్యారు. “ఇప్పటివరకు నేను 37 సినిమాలు చేశాను. ఆ 37 సినిమాలకు కలిపి ఎంత కష్టపడ్డానో, ఈ ఒక్క ‘భోగి’ కోసం అంత కష్టపడ్డాను. ఇది బ్లడ్ ఫెస్టా లేక బ్లడ్ పోసుకున్నారా అనేది నాకు తెలియదు కానీ,  అయ్యవారి సాక్షిగా చెప్తున్నా.. ఈ సినిమా కోసం నిజంగా బ్లడ్ పెట్టి పనిచేశాను.  ఒక యాక్షన్ హీరో అవ్వాలంటే, ఒక యాక్షన్ స్క్రిప్ట్ చేయాలంటే ఇంత కష్టం ఉంటుందా అని ఫస్ట్ టైం నేర్చుకున్నాను” అన్నారు.

తాను ఈ పాత్ర చేయగలనా లేదా అని సందేహించినప్పుడు, తనను నమ్మిన ఏకైక వ్యక్తి దర్శకుడు సంపత్ నంది అని శర్వా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్‌ను ‘సరస్వతీ పుత్రుడు’ అని కొనియాడుతూ, కొత్త సింగర్లను ప్రోత్సహిస్తున్న సంగీత దర్శకుడు భీమ్స్‌కు హాట్సాఫ్ చెప్పారు. ఇక పాట పాడిన నర్సన్నతో “మీరు చాలామందిని సీఎం చేశారంట.. నన్ను కూడా చేసేస్తారా ఏంటి?” అంటూ సరదాగా ఛలోక్తులు విసిరారు. మొత్తానికి, నవంబర్ 27న థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు “అరేయ్.. ఇదిరా సినిమా!” అని కచ్చితంగా అంటారని శర్వానంద్ ధీమా వ్యక్తం చేశారు. మరి ‘గంగ’గా శర్వానంద్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి!