Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తాజాగా నిర్వహించిన ‘భోగి’ మ్యూజికల్ నైట్‌లో ‘గంగ’ పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో శర్వానంద్ చేసిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్ డింపుల్ హయాతి గురించి స్టేజ్ పైనే ఆయన చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వేదికపై మాట్లాడుతున్న క్రమంలో హీరోయిన్ డింపుల్ హయాతి ప్రస్తావన రాగానే శర్వానంద్ ఎంతో ఆత్మీయంగా స్పందించారు. “డింపుల్.. లవ్ యూ ఆల్వేస్!”*అంటూ అందరి ముందు ఓపెన్‌గా చెప్పేయడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా చప్పట్లతో హోరెత్తించారు. ఆమె గురించి మాట్లాడుతూ.. “డింపుల్‌ను చూస్తేనే ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. తను సెట్లోకి రాగానే చుట్టుపక్కల అదొక అద్భుతమైన ఆరా క్రియేట్ అవుతుంది. అందరినీ ఎంతో కంఫర్టబుల్‌గా ఉంచుతుంది. ఆ అమ్మాయిలో ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీని ఎలా తీసుకోవాలో నేను కూడా నేర్చుకోవాలి” అంటూ డింపుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ వేడుకకు హాజరు కాలేకపోయిన మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి కూడా శర్వా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ఈ సినిమాలో నాది, అనుపమది చాలా అద్భుతమైన లవ్ స్టోరీ. గత 15, 20 ఏళ్లలో నేనైతే ఇలాంటి ప్రేమకథను చూడలేదు. పైకి లవ్ స్టోరీలా కనిపించదు కానీ, అంత అండర్ కరెంట్‌గా సంపత్ దాన్ని రాసిన తీరు చూసి సినిమా చూస్తున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను” అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం తాను పడ్డ శ్రమ గురించి చెబుతూ శర్వానంద్ కాస్త ఎమోషనల్ అయ్యారు. “ఇప్పటివరకు నేను 37 సినిమాలు చేశాను. ఆ 37 సినిమాలకు కలిపి ఎంత కష్టపడ్డానో, ఈ ఒక్క ‘భోగి’ కోసం అంత కష్టపడ్డాను. ఇది బ్లడ్ ఫెస్టా లేక బ్లడ్ పోసుకున్నారా అనేది నాకు తెలియదు కానీ, అయ్యవారి సాక్షిగా చెప్తున్నా.. ఈ సినిమా కోసం నిజంగా బ్లడ్ పెట్టి పనిచేశాను. ఒక యాక్షన్ హీరో అవ్వాలంటే, ఒక యాక్షన్ స్క్రిప్ట్ చేయాలంటే ఇంత కష్టం ఉంటుందా అని ఫస్ట్ టైం నేర్చుకున్నాను” అన్నారు.
Also Read
- Tharun Bhascker: డ్యూటీ ఎక్కుతున్నా.. దిగే ప్రసక్తే లేదు! ఇకపై తన రూట్ మారుస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్!
- Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
- Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
- Naga Chaitanya: నా మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
తాను ఈ పాత్ర చేయగలనా లేదా అని సందేహించినప్పుడు, తనను నమ్మిన ఏకైక వ్యక్తి దర్శకుడు సంపత్ నంది అని శర్వా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్‌ను ‘సరస్వతీ పుత్రుడు’ అని కొనియాడుతూ, కొత్త సింగర్లను ప్రోత్సహిస్తున్న సంగీత దర్శకుడు భీమ్స్కు హాట్సాఫ్ చెప్పారు. ఇక పాట పాడిన నర్సన్నతో “మీరు చాలామందిని సీఎం చేశారంట.. నన్ను కూడా చేసేస్తారా ఏంటి?” అంటూ సరదాగా ఛలోక్తులు విసిరారు. మొత్తానికి, నవంబర్ 27న థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు “అరేయ్.. ఇదిరా సినిమా!” అని కచ్చితంగా అంటారని శర్వానంద్ ధీమా వ్యక్తం చేశారు. మరి ‘గంగ’గా శర్వానంద్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి!
తాజావార్తలు
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్‌లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!