Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ… తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ సినీ ప్రముఖులపై వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్న తీరు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తన పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక మార్ఫింగ్ (AI-Generated) ఫేక్ వీడియోపై నటి షాలిని పాండే తమ సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో సృష్టించిందే తప్ప అందులో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు.
ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఇలా టెక్నాలజీని వాడటం తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలను ఏమాత్రం సహించకూడదని, సాధారణ విషయంగా తీసుకోరాదని ఆమె పేర్కొన్నారు.
నెటిజన్లు, అభిమానులకు ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. ఆ ఫేక్ వీడియో ఎక్కడైనా కనిపిస్తే దాన్ని ఎవరికీ ఫార్వర్డ్ చేయవద్దు, డౌన్లోడ్ చేయవద్దు, షేర్ చేయవద్దు. ఆ పోస్ట్‌లతో ఎలాంటి ఎంగేజ్మెంట్ పెట్టుకోకుండా వెంటనే సంబంధిత ప్లాట్‌ఫామ్‌లలో రిపోర్ట్ చేయండి. తప్పుడు కంటెంట్‌ను వ్యాప్తి చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించి, దాని సర్క్యులేషన్‌ను అడ్డుకోవడంలో సహకరించండి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను నిరోధించడానికి ప్రతి ఒక్కరూ సంయమనం, బాధ్యత పాటించాలని ఆమె కోరారు.
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!