Site icon NTV Telugu

Shah Rukh Khan: భయంతో పరుగుపెట్టిన హీరో..! ఎందుకో తెలుసా..?

Sharukh Khan

Sharukh Khan

తమ అభిమాన హీరో హీరోయిన్‌ ఎదురుగా కనిపిస్తే అభిమాని ఆనందమే వేరు. తనతో మాట్లాడాలని, సెల్ఫీ దిగాలని పక్కనే నిలబడాలని మాట్లాడుతుంటే చూడాలని ఆ ఉత్సాహమే వేరుంటుంది. ఆ అభిమానం కాస్త ముదిరితే సెలబ్రెటీలకు ఇబ్బందిని గురిచేస్తుంటారు అభిమానులు. పిచ్చి పరాకాస్ట అన్నట్టు అనే విధాంగా వుంటుంది. అయితే మన బాలీవుడ్‌ బాద్‌ షా ఒక ప్లేస్‌ కనిపించాడు ముందు అతన్ని చూసి గుర్తుపట్టలేకపోయిన అభిమానులు తాను నడుస్తూ ముందకొస్తుంంటే తన అభిమాన హీరో దగ్గరకు పరుగులు పెట్టారు. అంతే.. అది చూసిన ఆ హీరో అభిమానులు తన వద్దకు వస్తున్నారని తనుకూడా పరుగులు పెట్టారు. ఈ సన్నివేసాన్ని బిగ్‌ ఫ్యాన్‌ ఎస్‌ఆర్‌కె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. ఈ వీడియో కాస్త వైరల్‌ మారింది. షారుక్‌ ఖాన్‌ కు ఉన్న అభిమానగణం అంతా ఇంతా కాదు.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. షారుక్‌ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

షారుక్‌ గత నాలుగేళ్ల నుంచి తెరకు దూరమై కాస్త రెస్ట్‌ తీసుకున్నారు. ఆ తరువాత షారుక్‌ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా మారాడు. ఈనేపథ్యంలో.. షారుక్‌ ప్రస్తుత్తం రాజ్‌కుమార్‌ హిరాణీ తో కలిసి డంకీ మూవీ కోసం లండన్‌ లో షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ షూటింగ్‌ స్పాట్‌ లో షారుక్‌ ను గుర్తుపట్టిన అక్కడి వారు సెల్ఫీల కోసం షారుక్‌ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన బాద్‌ షా పరుగులుపెడుతూ.. వెల్లి తన కారులో కూర్చన్నాడు. షారుక్‌ పరుగులు పెడుతున్న వీడియోను కొందరు సెల్‌ఫోన్‌ లో బందించి దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసారు. కానీ.. సెలబ్రెటీలు ఏం చేసిన అది వైరల్‌ అంటూ కొందరు కామెంట్‌ చేస్తుంటే.. మరికొందరు బాద్‌ షా జీ భాగ్‌ రహేహై అంటూ కొందరు కామెంట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

IND Vs WI: దుమ్మురేపిన అక్షర్ పటేల్.. వన్డే సిరీస్ టీమిండియా కైవసం

Exit mobile version