L2E EMPURAAN: ‘L2E ఎంపురాన్’లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ జెరోమ్ ఫ్లిన్.. అదిరిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ల బ్లాక్‌బస్టర్ కాంబోలో 2019లో వచ్చిన లూసిఫెర్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పడు ఈ సినిమాకి సీక్వెల్ ‘L2E ఎంపురాన్’ అంటూ మార్చి 27న రాబోతోంది. లూసిఫర్‌కు సీక్వెల్ అయిన ‘L2E ఎంపురాన్’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్ ఈ చిత్రంలో బోరిస్ ఆలివర్ అనే కీలక పాత్రను పోషించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఐకానిక్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో బ్రోన్ పాత్రను పోషించిన జెరోమ్ ఫ్లిన్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జాన్ విక్ చాప్టర్ 3, సోల్జర్ సోల్జర్, బ్లాక్ మిర్రర్ వంటి అనేక ప్రాజెక్టుల్లో జెరోమ్ ఫ్లిన్ ‘L2E ఎంపురాన్’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు.
MAD Square: న్బవ్వులతో చంపడానికి ‘మ్యాడ్’ గాంగ్ దిగుతోంది!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇక ఈ సినిమాలో నటించడంపై ఈ మేరకు జెరోమ్ ఫ్లిన్ మాట్లాడుతూ..‘నేను ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చానో నాకు పూర్తిగా గుర్తులేదు. కానీ నేను యూకే,యూఎస్‌లో గడిపిన దానికంటే పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని పొందా. మాలీవుడ్ కల్చర్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మాలీవుడ్ సంస్కృతిలో భాగం కావడం, ఇక్కడి రుచుల్ని ఆస్వాధించడం నిజంగా ప్రత్యేకమైంది. నాకు ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది. నా యంగ్ ఏజ్‌లో నేను ఎక్కువగా ఇక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాల్ని తిరిగా, ఇండియాలో గడిపిన తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో నటించడంతో మళ్లీ నేను నా ఇంటికి వచ్చినట్టు అనిపించింది’ అని అన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన L2E ఎంపురాన్ లో మోహన్ లాల్ , పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, బైజు సంతోష్ వంటి ప్రముఖులు నటించారు. సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ కలిసి లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపక్ దేవ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. GKM తమిళ్ కుమరన్ లైకా ప్రొడక్షన్స్ హెడ్‌గా పని చేశారు. ‘L2E ఎంపురాన్’ మార్చి 27, 2025న మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!