కథ చెప్పి ఒప్పించలేను.. కానీ చూపించగలను: శేఖర్ కమ్ముల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆయన తాజాగా లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే (ఏప్రిల్ 16న) విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృందం. సినిమా వాయిదా పడిన.. ప్రమోషన్ లో మాత్రం మిగితా సినిమాల కంటే ముందే వుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా విషయాల గూర్చి చెప్పుకొచ్చాడు.
ఈమధ్య ప్రచారం జరిగినట్టుగానే.. ‘ఫిదా’ సినిమా కథని మొదటిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెప్పాడట ఈ దర్శకుడు. ఆ తరువాత రామ్ చరణ్‌కి వినిపించాడట.. అయితే ప్రేక్షకులను కదిలించే సున్నితమైన సన్నివేశాలను హీరోలకు డ్రామాటైజ్ చేసి చెప్పటం తనకు రాదన్నాడు. ఉదాహరణగా ‘ఫిదా’ సినిమాలో అక్క అత్తగారింటికి వెళ్తూ చెల్లెకి ఈ మాత్రలు తండ్రికి ఇవ్వాలంటూ చెబుతుంది. కానీ వీరు ఇవ్వకుండానే తండ్రి మాత్రలు వేసుకుంటాడు. ఇది ప్రేక్షకుల్ని కదిలించే సన్నివేశం.. ఇలాంటి సన్నివేశాల్ని చెప్పి హీరో, హీరోయిన్‌ను ఒప్పించలేనన్నారు.. కానీ తెరపై మాత్రం చూపించగలను అంటూ శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్‌కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!