SDT18 : అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో మెగా మేనళ్లుడు ‘సాయి దుర్గ్ తేజ్’..
- బ్రో - విరూపాక్షతో సూపర్ హిట్ కొట్టిన సాయి దుర్గ్
- కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సాయి దుర్గ్ తేజ్
- అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్ బ్రో, విరూపాక్ష వంటి వరుస బ్లాక్ బస్టర్ లు సాదించాడు. విరూపాక్ష గతేడాది ఏప్రిల్ లో విడుదలై ఏడాదిన్నర దాటుతున్నకూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు ఈ సుప్రీమ్ హీరో. ప్రస్తుతం ఈ సుప్రీమ్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా #SDT18. ఈ సినిమాతోనే రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మికంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ వెలువడింది.
Also Read : VenkyAnil3 : ‘వెంకీ మామ’ సెట్లో.. ‘బాల బాబాయ్’ సందడి.. ఫోటోలు వైరల్
Also Read
ప్రస్తుతం #SDT18 సినిమా 15 రోజుల థ్రిల్లింగ్ యాక్షన్ షూట్ పూర్తి చేసుకుంది, ఓ ప్రముఖ ఫైట్ కొరియోగ్రఫి మాస్టర్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, హై-ఆక్టేన్ స్టంట్స్ మరియు డైనమిక్ ఫైట్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని యూనిట్ భావిస్తోంది. తదుపరి షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో భారీ సెట్లను ఏర్పాటు చేశారు. ఈ భారీ సెటప్ నిర్మాణ విలువలను తెలియజేసేలా కనిపిస్తోంది. కాగా, ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ సరికొత్త మేకోవర్ లో కనిపించనున్నాడు, ఇందుకోసం లుక్ మార్చాడు. ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ సరసన ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో పాన్-ఇండియా విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?