Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
- ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా..
- ‘కల్కి 2’ మేకింగ్ వీడియో విడుదల...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2: పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ‘కల్కి 2’ చిత్రబృందం అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేసింది. దీంతో ‘కల్కి 2898 AD’ తర్వాత రెండో భాగం కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.
‘కల్కి 2’ మేకింగ్ వీడియోలో ప్రభాస్ మరోసారి భైరవ పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టం చేశారు. తొలి భాగంలో భైరవగా ప్రభాస్ చేసిన యాక్షన్, ఆయన పాత్ర తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సీక్వెల్లో ఈ పాత్ర ఎలా ఉండబోతోంది? కథలో ఎలాంటి కీలక మలుపులు చోటుచేసుకోబోతున్నాయి? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చిత్రబృందం ప్రత్యేక సందేశాన్ని కూడా పంచుకుంది. ప్రతి తరంలో అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్‌తో మరో అద్భుతమైన సినీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపింది.
Also Read
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. తొలి భాగంలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు. ‘కల్కి 2’లోనూ కథ మరింత భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు సమాచారం. సినిమాలోని భవిష్యత్ ప్రపంచ సన్నివేశాలను మరింత పెంచడంతో పాటు, తొలి భాగంలో పరిచయమైన పాత్రల మధ్య సంబంధాలు, కథలోని కీలక అంశాలకు సీక్వెల్లో మరింత ప్రాధాన్యం ఉండనుందని అంచనాలు ఉన్నాయి.
To the superhero of Indian Cinema…
Happy Birthday to the Darling of every generation, Rebel Star #Prabhas.We are excited to embark on another epic cinematic journey with you… #Kalki2898AD ⚡ https://t.co/uE5GQAOr4c
— Kalki 2898 AD (@Kalki2898AD) October 23, 2026
తాజావార్తలు
-
Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
-
India-China Border Tensions: అరుణాచల్ సరిహద్దులో చైనాతో ఇంకా ఉద్రిక్తతలు.. ITBP డీజీ కీలక ప్రకటన
-
Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన!
ట్రెండింగ్
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!