బాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ “సత్యనారాయణ్ కీ కథ”. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ యూనిక్ లవ్ స్టోరీలో కార్తీక్ ఆర్యన్ తో శ్రద్ధ కపూర్ జతకట్టబోతోంది. ఇటీవలే మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను మారుస్తునట్టు దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. ‘సత్యనారాయణ్ కి కథ’ చిత్రం దర్శకుడు సమీర్ విద్వాన్స్ ‘మనోభావాలను దెబ్బతీయకుండా ఉండటానికి’ ఈ నిర్ణయం అంటూ పోస్ట్ చేశారు. “మనోభావాలను దెబ్బతీయకుండా ఉండటానికి ఇటీవల ప్రకటించిన మా చిత్రం ‘సత్యనారాయణ్ కి కథ’ టైటిల్‌ను మార్చాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయానికి సినిమా నిర్మాతలు, సృజనాత్మక బృందం కూడా పూర్తి మద్దతు ఇస్తున్నాయి. త్వరలోనే మా ప్రేమకథకు కొత్త టైటిల్ ను ప్రకటిస్తాము” అని ట్వీట్ చేశారు.
Read Also : “ఆర్ఆర్ఆర్” బ్యూటీకి షారుఖ్ ప్రామిస్…!
ఇక కార్తీక్ ఆర్యన్ నటించిన ‘థమాకా’ ప్రస్తుతం ఓటీటీలో విడుదల కాబోతోంది. ‘భూల్ బులయ్యా 2’ సెట్స్ పై ఉంది. దీని తర్వాత ‘అల వైకుంఠపురములో’ రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది. అలానే హన్స్ లాల్ మెహతా నిజ సంఘటనల ఆధారంగా తీయబోతున్న మరో సినిమాలో కార్తీక్ ఆర్యన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా నటించబోతున్నాడు. ప్రస్తుతం కార్తీక్ చేతినిండా ప్రాజెక్టులతో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు.