“ఆర్ఆర్ఆర్” బ్యూటీకి షారుఖ్ ప్రామిస్…!

“ఆర్ఆర్ఆర్”లో హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ నిర్మాతగా మారబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అలియా నిర్మాతగా తన మొదటి ప్రాజెక్ట్ ‘డార్లింగ్స్’ షూటింగ్ ను ప్రారంభించింది. ఈ చిత్రంలో షెఫాలి షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ నటిస్తున్నారు. దీనికి జస్మీత్ కె రీన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అలియా భట్ తన ఎటర్‌నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై షారుఖ్ ఖాన్ తో కలిసి నటిస్తోంది. ఇక నిర్మాతగా తన మొదటి చిత్రం ప్రారంభమైన సందర్భంగా అలియా ఓ పిక్ ను షేర్ చేస్తూ తన ఫీలింగ్ ను పంచుకుంది. “డార్లింగ్స్‌లో ఒక రోజు! నిర్మాతగా నా మొదటి చిత్రం. కానీ నేను ఎప్పటికీ ముందుగా నటిని అనే చెబుతా… ఈ సినిమా విషయంలో చాలా నెర్వస్ గా ఫీల్ అవుతున్నాను. దీని గురించి రాత్రంతా కలలు కంటూనే ఉన్నాను. సెట్స్ కు నేను ఆలస్యంగా వస్తానేమో అనే భయంతో 15 నిమిషాల ముందుగానే చేరుకున్నాను. కానీ భయం ఉందంటే అర్థం మనం పనిపై శ్రద్ధ వహిస్తున్నట్టే. ఈ నెర్వస్ నెస్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉంటుందేమో” అంటూ ట్వీట్ చేసింది.

Read Also : శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీలో మరో హీరో ?

అయితే ఆమె ట్వీట్ పై స్పందించిన బాలీవుడ్ కింగ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. “ఈ ప్రాజెక్ట్ తరువాత దయచేసి మీ తదుపరి ప్రొడక్షన్ లో నన్ను కూడా కలుపుకోండి. నేను షూటింగ్ కు సమయానికి వస్తాను. చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను. ప్రామిస్! ” అంటూ ట్వీట్ చేశాడు షారుఖ్. “నా ఫేవరేట్ స్టార్ ఇంకేం అడగను… డీల్ ఓకే” అంటూ బదులిచ్చింది అలియా. ప్రస్తుతం వీరిద్దరి ట్విట్టర్ సంభాషణ చర్చనీయాంశంగా మారింది.

-Advertisement-"ఆర్ఆర్ఆర్" బ్యూటీకి షారుఖ్ ప్రామిస్...!

Related Articles

Latest Articles