ఈ రోజు టాలెంటెడ్ హీరో సత్య దేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇది రస్టిక్ మూవీగా తెరకెక్కనుంది అన్పిస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివను ఈ మూవీ స్క్రిప్ట్ బాగా ఆకట్టుకోవడంతో… సత్యదేవ్ నటిస్తున్న ఈ చిత్రానికి ప్రెజెంటర్ గా మద్దతు ఇస్తున్నారు. సత్య దేవ్ విజయవాడకు చెందిన యువకుడి పాత్రలో నటించనుండగా, ఈ రస్టిక్ డ్రామాను విజయవాడ పరిసరాల్లో చిత్రీకరించనున్నారు.
Read Also : రకుల్ కోసం కోవిసెల్ఫ్ కిట్ పంపిన స్టార్ హీరో
కొత్త దర్శకుడు గోపాల్ దీన్ని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లాలని యోచిస్తున్నాడు. కృష్ణ కొమ్మలపతి తన అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కాలా భైరవ, ఎడిటర్ నవీన్ నూలి వంటి అగ్ర సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. ఇక సత్యదేవ్ కు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.