Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సారా అలీ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, వామిఖా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా పతి పత్ని ఔర్ వో దో (Pati Patni Aur Woh Do). మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.17.53 కోట్ల నెట్ కలెక్షన్లతో సాలిడ్ ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘పెళ్లి’ అనే టాపిక్ రాగా.. సారా అలీ ఖాన్ కుండబద్దలు కొట్టినట్లు తన మనసులోని మాటను బయటపెట్టారు.
మనకు తెలిసి సారా అలీ ఖాన్ తన తల్లిదండ్రుల వైవాహిక జీవితాన్ని చాలా దగ్గరగా చూశారు. సారా తల్లిదండ్రులైన సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌లు 1991లో వివాహం చేసుకుని, 13 ఏళ్ల తర్వాత 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్.. కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకోగా, అమృతా సింగ్ మాత్రం పిల్లల కోసం ఒంటరిగానే ఉండిపోయారు. ఈ నేపథ్యాన్ని ఉద్దేశిస్తూ సారా ఎమోషనల్ గా..
Also Read
‘పెళ్లిళ్లు కొన్నిసార్లు అనుకోని విధంగా పెటాకులు కావచ్చు.. అది నేను కళ్లారా చూశాను. అందుకే పెళ్లిని కేవలం ఒక అందమైన ఊహలా నేను చూడను. సమాజం కోసమో, లేదా తోడు కావాలనో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. నా జీవితంలో ఏదో వెలితి ఉందని, దాన్ని భర్తీ చేయడానికి మరొకరు రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాకు పర్ఫెక్ట్ అనిపించే సరైన వ్యక్తి దొరకకపోతే.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడానికి కూడా నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను’ తెలిపింది. ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా కేవలం సినిమాలు, కెరీర్‌పైనే ఉందని, అనవసరమైన బంధాల్లోకి దూకి ఇబ్బంది పడటం కంటే కెరీర్లో ఎదగడమే తన ప్రస్తుత లక్ష్యమని తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్‌షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!