Dheeraj Mogilineni : “ఓటీటీలో చూసి ఏడిస్తే లాభం లేదు.. ట్వీట్లు ఆపి థియేటర్‌కు రండి”..సమ్మర్ హాలిడేస్’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను థియేటర్లలో చూడకుండా, ఓటీటీలో వచ్చాక ఆకాశానికి ఎత్తేసే ప్రేక్షకుల తీరుపై యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సమ్మర్ హాలిడేస్’ (Summer Holidays) థ్యాంక్స్ మీట్ తాజాగా జరిగింది. ఈ వేదికపై ఆయన చేసిన ఎమోషనల్ అండ్ సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వేదికపై ధీరజ్ మాట్లాడుతూ.. థియేటర్లకు రాకుండా కేవలం సోషల్ మీడియాలో సానుభూతి చూపిస్తున్న ప్రేక్షకుల మైండ్‌సెట్‌ను కడిగిపారేశారు. “సినిమా బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, నాకు పర్సనల్‌గా వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తే ఎలాంటి ఉపయోగం లేదు. ’35’, ’90s’ లాంటి అద్భుతమైన సినిమాలను థియేటర్లలో మిస్ చేసుకుని, ఓటీటీలో వచ్చాక చూసి చప్పట్లు కొడుతున్నారు, ఏడుస్తున్నారు. దానివల్ల మాలాంటి నిర్మాతలకు ఒరిగేదేమీ లేదు. మీ ఫోన్లలో ట్వీట్లు కొట్టడం కాదు.. ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తేనే మంచి సినిమాలు బతుకుతాయి. మీ ఫ్రెండ్స్ చెప్పారో, రివ్యూలు బాగున్నాయనో మెసేజ్‌లు చేయడం ఆపి, ముందు మీరు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి. ఒకవేళ ఇవే సినిమాలు పక్క రాష్ట్రాల్లో వస్తే మాత్రం ఆదరిస్తున్నారు. మన సినిమాలను మనం గుర్తించడం మానేశాం. ఇలాగే కంటెంట్‌ను ఆదరించకపోతే.. మాలాంటోళ్లు సినిమాలు తీయడం ఆపేస్తారు. వందలాది మంది టాలెంటెడ్ డైరెక్టర్లు మంచి కథలతో బయటే మిగిలిపోతారు” అంటూ ధీరజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రూ.500 ఖర్చుతో ఫ్యామిలీ అంతా పండుగ పూట ఒక మంచి సినిమాను ఎంజాయ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని ఆయన కోరారు.
ఈ సినిమాకు అండగా నిలబడిన మీడియాకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నటీనటుల గురించి మాట్లాడుతూ.. జయసుధ గారిని తప్ప అమ్మమ్మ పాత్రలో మరొకరిని ఊహించుకోలేకపోయానని, తెరపై ఆమెను చూస్తుంటే తన సొంత అమ్మమ్మే గుర్తొచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ఆమె ఈ సినిమాకు ప్రాణం పోశారన్నారు. అలాగే మదర్ క్యారెక్టర్లలో వాసుకి, హర్షిని అద్భుతంగా జీవించారని కొనియాడారు. రాజీవ్ కనకాల, హర్షవర్ధన్ లాంటి సీనియర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా డేట్స్ అడ్జస్ట్ చేసి సపోర్ట్ చేశారని తెలిపారు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు రోహన్, అరుణ్‌లకు ఉన్న టాలెంట్ గాడ్స్ గిఫ్ట్ అని, పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నదే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. సినిమా వెనుక ఉన్న టెక్నికల్ టీమ్‌పై ధీరజ్ ప్రశంసల వర్షం కురిపించారు. “మా ఎడిటర్ సంతోష్ డైరెక్టర్ తర్వాత మరో డైరెక్టర్ లాంటి వాడు. ఎడిటింగే కాకుండా డబ్బింగ్, మిక్సింగ్, డిఐ ఇలా పోస్ట్ ప్రొడక్షన్ భారం మొత్తం తన భుజాలపై వేసుకుని రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. నా ప్రతి సినిమాలో సంతోష్ ఉండాల్సిందే. అలాగే డైరెక్టర్ రవి (చెన్నై లవ్ స్టోరీ ఫేమ్) ఒక బ్రదర్‌లా నిలబడి, లాస్ట్ మినిట్‌లో సినిమా ఇంప్రూవ్‌మెంట్‌కు ఎంతో వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చాడు” అని తెలిపారు. సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్ విజువల్స్, సింజిత్ మ్యూజిక్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని, భవిష్యత్తులో సింజిత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ధీరజ్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సెన్సేషన్
- Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
- Chandrayaan Trailer: చంద్రయాన్ మూవీ ట్రైలర్ చూశారా!
- Kaka Release: ‘కాకా’ వెనక్కి తగ్గేదే లే.. రూమర్లకు ‘రెస్ట్ ఇన్ పీస్’ చెప్పిన కోన వెంకట్!
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Dheeraj Mogilineni : “ఓటీటీలో చూసి ఏడిస్తే లాభం లేదు.. ట్వీట్లు ఆపి థియేటర్‌కు రండి”..సమ్మర్ హాలిడేస్’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
-
Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Telangana Student Missing: అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. బోస్టన్‌లో తీవ్ర కలకలం
-
Hyderabad: భర్తలు తేవడం.. భార్యలు అమ్మడం.. ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం దందా!
ట్రెండింగ్
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..