వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి ఆట నుంచే సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేస్తోంది, కొన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు పోతోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమా రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది..
Saif Ali Khan : ముంబైలో సైఫ్ దాడి చేసిన వ్యక్తికి ‘సంరక్షకుడు’గా వ్యవహరించిన జితేంద్ర పాండే ఎవరు?
అదేమిటంటే అల వైకుంఠపురంలో సినిమా వారం రోజుల్లో 180 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా దాన్ని ఆరు రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రాస్ చేసింది. దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను దిల్ రాజు సోదరుడు శిరీష్ నిర్మించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్-టైమ్ ఇండస్ట్రీ మైల్ స్టోన్ ని సాధించింది, 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 12.5 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 16.12 కోట్ల షేర్ సాధించింది. తెలుగు సినిమా 6వ రోజు కలెక్షన్స్ లోసంక్రాంతికి వస్తున్నాం కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది, రాజమౌళి RRR 6వ రోజు 9 కోట్ల షేర్‌ను అధిగమించింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ మార్కును దాటింది.