ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారమీ నిజమైంది. నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. గోల్డెన్ లెగ్ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని సినిమాలతో హిట్లు కొడుతూ వస్తోంది. ఇక ఈ భామ ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోతోంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి తన సూపర్ హిట్ చిత్రం అఖండ సీక్వెల్ చేస్తున్నారు. అఖండ 2 తాండవం పేరుతో ఈ సినిమాని డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మధ్యనే మహాకుంభమేళాలో కొన్ని సీన్స్ షూట్ చేసుకొచ్చారు. ప్రస్తుతానికి లొకేషన్ రెక్కీ చేస్తున్నారు, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుందని ముందు ప్రకటన వచ్చింది. ఇటీవల డాకు మహారాజ్ ప్రమోషన్స్ విషయంలో కూడా పలు సందర్భాలలో ఇదే విషయాన్ని మాట్లాడారు.
Anil Ravipudi: ‘జైలర్’ చూసి మహేష్ చెబితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ పుట్టింది!
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, ఆమె సడన్గా తప్పుకోవడంతో ఇప్పుడు తెరమీదకు సంయుక్త మీనన్ ను తీసుకువచ్చారు మేకర్స్. అయితే ఆమెను తప్పించి ఈమెను తీసుకువచ్చారా లేక ఆమె తప్పుకోవడంతో ఈమెను తీసుకువచ్చారా? అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రామ్ ఆచంటతో కలిపి గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ తో పాటు సంయుక్త కనిపించబోతుందా? లేక ఆమెను తప్పించి ఈమెను తీసుకు వచ్చారా? అనే విషయం మీద సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.