ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి మరిన్ని కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది అయితే ఈ సినిమా పుట్టడానికి కారణమే మహేష్ బాబు కామెంట్స్ అంటూ తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు అనిల్ రావిపూడి. ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ఈ సినిమా చూసి ఆద్యంతం ఎంజాయ్ చేశారు. అలాగే ఈ జానర్ లో సినిమా చేయమని నాకు సలహా ఇచ్చిందే ఆయన, భగవంత్ కేసరి సినిమా చేస్తున్నప్పుడు మీరు కామెడీ బాగా చేస్తారు మీకు ఆ స్ట్రెంత్ ఉంది.
Saif Ali Khan: పోలీసు కస్టడీకి సైఫ్ కేసు నిందితుడు
మీరు ఒక డిఫరెంట్ ట్రై చేయండి, మీరు ఇండస్ట్రీని షేక్ చేస్తారని ఎప్పుడో చెప్పారు. ఆయన జైలర్ సినిమా చూశాక ఈ మాటలు చెప్పారు. మన ఇండస్ట్రీలో మీకు ఆ పొటెన్షియల్ ఉంది మీరు దాన్ని వాడుకోండి అని జైలర్ రిలీజ్ అయిన తర్వాత మహేష్ చూసి నాకు కాల్ చేసి చెప్పారు. ఈ విషయం మీద నాతో దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సినిమా పుట్టడానికి అదే స్టార్టింగ్ పాయింట్ ఆయనే నా మైండ్ లో విత్తనం నాటేలా చేశారు అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన తర్వాత నాలో ఒక కసి మొదలైంది, నేను పనిచేసిన ఒక హీరో నన్ను నమ్మి ఇంత మంచి జానర్ ట్రై చేయమని చెప్పి, అది ట్రై చేస్తే వండర్స్ క్రియేట్ చేస్తారని చెబితే అప్పుడు స్టార్ట్ అయింది నా బ్రెయిన్ లో. ఈసారి చేసే ఎంటర్టైనర్, కంప్లీట్ గా మారి చేద్దామని అనుకున్నాను చేసి హిట్టు కొట్టాను అని చెప్పుకొచ్చారు.