టాలీవుడ్ బ్యూటి సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో జత కట్టిన ఈ చిన్నది అదే సమయంలో, తమిళ్ లో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయం దేవుడెరుగు కానీ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. వ్యాక్తిగతంగా, హెల్త్ పరంగా చాలా స్ట్రగుల్స్ ఎదురుకుంది సామ్. కానీ ఎక్కడ కూడా ధైర్యం కోల్పోలేదు. తన మనోభలం, సంకల్పం గొప్పది. ఇక ఇదిలా ఉంటే సామంత తాజాగా ఆటోలో దర్శనమిచ్చింది.
Also Read:Parvati Nair : వివాహ బంధంలోకి అడుగు పెట్టిన తెలుగు స్టార్ హీరోయిన్
ముంబై వీదులో స్టార్ హీరోలు, హీరోయిన్‌లు అప్పుడప్పుడు ఆటోలో ప్రయాణాలు చేస్తుంటారు. తాజాగా ఈ జాబితాలోకి హీరోయిన్ సమంత కూడా చేరారు. ముంబై రోడ్లపై ఆటోలో ఆమె చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోకు రకుల్ ప్రీత్ ట్యాగ్ చేస్తూ ఆమె నటించిన ‘మేరే హస్బెండ్ కీ బివీ’ అనే సినిమాలోని సాంగ్ జోడించింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.