జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డ ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్ న్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు, అక్కడ సైఫ్ అలీఖాన్ శస్త్రచికిత్స నాలుగు గంటల పాటు కొనసాగింది. సీసీటీవీలో అనుమానితుడు కనిపించడంతో పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడు కనిపించాడని ముంబై పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈ విషయంలో కొత్త అప్‌డేట్ బయటకు వస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన తర్వాత నిందితుడు బట్టలు కూడా మార్చుకుని ఉదయం 8 గంటల వరకు బాంద్రాలోనే ఉన్నాడు.
CM Chandrababu: మైదుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
అనుమానితుడు చివరిగా బాంద్రా రైల్వే స్టేషన్‌లో కనిపించాడు, ఆ తర్వాత అతను వసాయి, విరార్ లేదా నలసోపరాకు వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బృందాలను అన్ని ప్రాంతాలకు పంపించారు. ఇక తాజాగా లీలావతి హాస్పిటల్ సీఈఓ డాక్టర్ నీరజ్ ఉత్తమని మాట్లాడుతూ.. ‘శుక్రవారం సైఫ్ అలీఖాన్‌ను ప్రత్యేక గదికి మార్చాం. ప్రస్తుతం అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మరో 2, 3 రోజుల్లో అతన్ని డిశ్చార్జి చేయాలని భావిస్తున్నాం. డాక్టర్ ప్రకటన తర్వాత, సైఫ్ అలీ ఖాన్ సోమవారం నాటికి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.