బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటించిన చిత్రం ‘రామ్ నగర్ బన్నీ’ శ్రీనివాస్ మహాత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ కలిసి నిర్మించారు. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబివకా వాని, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా గతేడాది అక్టోబర్ లో థియేటర్లో రిలీజ్ అయింది. విడుదలకు ముందు కొడుకు కోసం ప్రభాకర్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశాడు. అయితే ప్రమోషన్స్ లో చంద్రహాస్ మాటలు, తీరుపై నెగిటివిటీ వచ్చింది సోషల్ మీడియాలో అతని ట్రోలింగ్ చేసి ‘యాటిట్యూడ్ స్టార్’గా బిరుదు కూడా ఇచ్చారు జనాలు. ఈ ట్రోలింగ్ వల్ల తన సినిమా కూడా బాగా పాపులర్ అయ్యింది.
కానీ ఆశించిన స్థాయిలో జనాలను ఈ సినిమా మెప్పించలేకపోయింది. పెద్దగా టాక్ కూడా లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే సైలెంట్ థియేటర్ లో నుంచి తప్పుకుంది. అయితే తాజాగా ఈ మూవీ OTT విడుదల అయింది. ఇప్పటి సినిమాలు విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీకి వస్తున్నాయి. కానీ ఈ ‘రామ్ నగర్ బన్నీ’ మూవీ ఓటీటీకి వచ్చేందుకు మూడు నెలల సమయం పట్టింది. కాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా ఈ సినిమా డిజిటల్ రైట్స్ తీసుకుంది. జనవరి 17 నుంచి ఈ చిత్రం ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక OTTలో రిలీజై వడ్ డే నే అవుతున్నప్పటికి ముందు ముందు టాక్ ఎలా ఉంటుందో చూడాలి.