అక్కనేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన భారీ విజయం సొంతం చేసుకుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ,చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వచ్చింది. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ కలెక్షన్‌ల పరంగా ధూసుకుపొతుంది. చై కెరీర్ లో ఈ మూవీ చాలా ప్లెస్ అయ్యింది. ఇక రీసెంట్‌గా సక్సెస్ పార్టి కూడా ఎంతో గ్రాండ్‌గా జరుపుకున్న మూవీ టీం తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Also Read:Kannappa: ‘కన్నప్ప’ కి ప్రభాస్ పారితోషికం తీసుకోవడం లేదా..!
తండేల్ మూవీ ఇంత మంచి హిట్ అవ్వడంతో తాజాగా చిత్ర బృందం గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, దర్శకుడు చందూ మొండేటి తదితరులు శ్రీవారిని సేవించుకున్నారు. ఇక దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సినిమా బృందానికి అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అలాగే టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఇక అల్లు అరవింద్, నాగ చైతన్య, సాయి పల్లవి, బన్నీ వాసు తదితరులు స్వామివారి దర్శనానికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.