టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. వంద కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిన ఈ డివోషనల్ మల్టీస్టారర్ మూవీలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, దేవరాజ్, మధుబాల, శరత్ కుమార్, ముఖేష్ ఋషి తదితరలు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అయితే ఎక్కువగా దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం ప్రభాస్. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో టీమ్ ప్రమోషన్స్ వేగం కూడా పెంచింది.
Also Read:Ranbir Kapoor: టాలీవుడ్‌లో మూవీ చేయబోతున్న బాలీవుడ్ స్టార్..!
ఇందులో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటీ అంటే ‘కన్నప్ప’ కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. కేవలం మంచు కుటుంబం మీద, ముఖ్యంగా మోహన్ బాబు మీద అభిమానంతో ఉచితంగా నటించేశాడు. అయితే నిర్మాతగా ఎంత అడిగినా ఇవ్వడానికి విష్ణు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభాస్ నయా పైసా తీసుకోకపోవడం విశేషం. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు విష్ణు.. ‘ నేను ప్రభాస్ ఇంకా మోహన్ లాల్ ఇద్దరికీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాను. కానీ వాళ్లిద్దరూ ఒక్క రూపాయి కూడా వద్దని తిరస్కరించారు. మోహన్ లాల్ అయితే.. ఏంటి అంత పెద్దవాడివి అయిపోయావా అని అడిగారు. వాళ్లిద్దరూ స్నేహానికి విలువ ఇచ్చే అంత గొప్ప నటులు’ అని మంచు విష్ణు తెలిపారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.