తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లలపై లైంగిక దాడులను అరికట్టడం, అవగాహన కల్పించడమే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) – యంగ్ ఇండియన్స్ (YI) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 70 నగరాల నుంచి వేలాది మంది యువ ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
Also Read : Paradise : నాని ‘ప్యారడైజ్’ లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “పిల్లలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. సోషల్ మీడియాలో పిల్లలపై అబ్యూజ్ చేస్తూ, దీనిపై లైక్స్ వేస్తూ, నవ్వే సమాజం మనం కోరుకోవాలా? స్వేచ్ఛ ఉన్నా, అది ఎదుటివారికి నొప్పి కలిగించే స్థాయిలో ఉండకూడదు” అని గట్టిగా వ్యాఖ్యానించారు. తన సామాజిక కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ.. “2015లో అరకు ప్రాంతంలో పిల్లల విద్య కోసం స్కూల్ నిర్మించాను. కొంతమంది పిల్లలను దత్తత తీసుకొని వారి చదువు, పోషణ చూసుకుంటున్నాను. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తప్పనిసరిగా చెప్పాలి. తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడపాలి. వారంలో కనీసం ఒక రోజు అయినా కుటుంబంతో కలిసి కూర్చోవాలి” అని సూచించారు. అలాగే సోషల్ మీడియా అకౌంట్ విషయంలో..
“పిల్లల అకౌంట్స్ తప్పని సరిగా తల్లిదండ్రుల నంబర్లు లేదా ఆధార్‌తో లింక్ చేయాలి. నా సినిమాల్లో కూడా టీజింగ్ సాంగ్స్‌కి దూరమయ్యాను. ప్రేమిస్తే పొగడాలి కానీ టీజ్ చేయకూడదు. సోషల్ మీడియాలో కాకుండా రియల్ వరల్డ్‌లో బతకడం నేర్పించాలి” అని స్పష్టం చేశారు. ఇక చివరగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. “నా పెళ్లి గురించి ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. కానీ పెళ్లి చేసుకునే సమయం వస్తే నేను ప్రకటిస్తాను” అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.