Paradise : నాని ‘ప్యారడైజ్’ లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. తాజాగా ‘హిట్: ది థర్డ్ కేస్’తో మంచి విజయం సాధించిన ఆయన, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత భారీగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై నాని తన పూర్తి దృష్టి పెట్టారు. ఈ చిత్రాన్ని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక ఈ ప్రాజెక్ట్‌పై అద్భుతమైన హైప్ నడుస్తున్న సమయంలో, మంచు లక్ష్మి ఓ పెద్ద అప్‌డేట్‌ను బయటపెట్టారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇది అధికారికంగా బయటకు వచ్చిందా తెలియదు. కానీ నేను చెప్పేస్తాను. నాన్నగారు (మోహన్ బాబు) కూడా ‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర చేస్తున్నారు. ఆ పాత్ర కోసం ఆయన ఈ వయసులోనూ చాలా కష్టపడుతున్నారు. ప్రతి సినిమాను తన మొదటి సినిమాలా ట్రీట్ చేసుకోవడం మా నాన్నగారి గొప్పతనం. ఆయన లుక్ కోసం ఎంత కష్టపడుతున్నారో చూసి నేనెంతో ఇన్‌స్పైర్ అయ్యాను” అని తెలిపారు. ఈ అప్డేట్ వెలుగులోకి రావడంతో నాని అభిమానులు, మోహన్ బాబు అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇంత వరకు రహస్యంగా ఉంచిన ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాని – మోహన్ బాబు కాంబినేషన్ స్క్రీన్‌పై ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది.
Also Read
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
ఇక ‘ది ప్యారడైజ్’ ను ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్ కలబోతగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే, ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఈ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్‌ను 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఈ సినిమా బిజినెస్ రికార్డులు సెట్ చేస్తోందని సమాచారం.
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!