తెలుగు హీరోల హిందీ అనువాద చిత్రాలకు ఉత్తరాదిన భలే క్రేజ్ ఉంటుంది. ఇవి థియేట్రికల్ రిలీజ్ కాకపోయినా, శాటిలైట్ ఛానెల్స్ లోనూ, యూ ట్యూబ్ లోనూ ప్రసారం కాగానే విశేష ఆదరణ లభిస్తుంటుంది. లక్షలాది మంది వాటిని చూడటమే కాదు… లైక్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అలా సాయిధరమ్ తేజ్ నటించిన సినిమాలు రెండు ఇప్పటికే 1 మిలియన్ లైక్స్ ను పొందాయి. ఆ మధ్య సాయి తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యూ సినిమా సుప్రీమ్ ఖిలాడీ -2 పేరుతో హిందీలో డబ్ అయ్యింది. అలానే ప్రతి రోజూ పండగే సినిమాను కూడా హర్ దిన్ దివాలీ పేరుతో డబ్ చేశారు. ఈ రెండు సినిమాలకు లక్షల్లో వ్యూస్ తో పాటు వన్ మిలియన్ లైక్స్ లభించాయి. తాజాగా సాయితేజ్ మూవీ చిత్రలహరి హిందీ వర్షన్ ప్రేమమ్ కూడా ఇదే జాబితాలో చేరింది. ఆ రకంగా సాయి ధరమ్ తేజ్ సైతం నిదానంగా ఉత్తరాదిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇది ఇలానే కొనసాగితే… రాబోయే రోజుల్లో ఈ మెగా ఫ్యామిలీ హీరో సైతం పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు!