తెలుగు హీరోల హిందీ అనువాద చిత్రాలకు ఉత్తరాదిన భలే క్రేజ్ ఉంటుంది. ఇవి థియేట్రికల్ రిలీజ్ కాకపోయినా, శాటిలైట్ ఛానెల్స్ లోనూ, యూ ట్యూబ్ లోనూ ప్రసారం కాగానే విశేష ఆదరణ లభిస్తుంటుంది. లక్షలాది మంది వాటిని చూడటమే కాదు… లైక్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అలా సాయిధరమ్ తేజ్ నటించిన సినిమాలు రెండు ఇప్పటికే 1 మిలియన్ లైక్స్ ను పొందాయి. ఆ మధ్య సాయి తేజ్ నటించిన తేజ్ ఐ లవ్…