SS Thaman: ఆర్టిస్ట్‌కి ఒక టాలెంట్ ఉంటే సరిపోదు.. కసి కూడా ఉండాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Thaman Speech At Shivam Bhaje Trailer Launch Event: ‘ఆట మొద లెట్టావా శంకరా’.. ‘నీ వెనకుండి నడిపిస్తున్న ఆ గుంటనక్క గురించి కూడా తెలుసు రా నా కొడకా’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్‌తో శివం భజే ట్రైలర్‌లో విశ్వరూపం చూపించాడు అశ్విన్ బాబు. గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’ ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మంగళవారం నాడు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి మాస్ కా దాస్ విశ్వక్ సేన్, తమన్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూశా. చాలా బాగుంది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్ అనేలా ఉంది. ఆర్ఆర్ అదిరిపోయింది. అశ్విన్ కెరీర్‌లో ఇది నిలిచిపోతుందనిపిస్తుంది. అశ్విన్ ఎంతో మంచి వ్యక్తి. ట్రైలర్ చూస్తే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. ఆగస్ట్ 1న అశ్విన్‌కు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నా’నని అన్నారు.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘శివం భజే ట్రైలర్ బాగుంది.. అశ్విన్ ఏ సినిమా చేసినా ముందు నాకు చూపిస్తాడు. అశ్విన్ నాకు ఓ బ్రదర్ లాంటివాడు. అశ్విన్ కెరీర్‌లో శివం భజే ది బెస్ట్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. శివేంద్ర నాతో పని చేశాడు. వికాస్ ఆర్ఆర్ బాగుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి గారికి మంచి సక్సెస్ రావాలి. డైరెక్టర్ అప్సర్ సినిమాను బాగా తీశారు. దిగంగనాకి ఈ చిత్రం పెద్ద విజయం చేకూరాలి. ఆర్ఆర్ ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది. విశ్వక్‌ని ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. శివం భజే టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
తమన్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ రెండు రోజుల ముందు చూశాను. డైరెక్టర్ అప్సర్, నిర్మాత మహేశ్వర్ రెడ్డికి, అశ్విన్‌కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఓ ఆర్టిస్ట్‌కి ఒక టాలెంట్ ఉంటే సరిపోదు.. కసి కూడా ఉండాలి. అశ్విన్‌కు ఆ కసి ఉంటుంది. అశ్విన్ బాల్‌ను ఎలా బాదుతాడో.. బాక్సాఫీస్‌ను కూడా అలానే బాదాలి. శివుడి గురించి కొట్టేటప్పుడు మనం ఏం చేయకపోయినా.. శివుడే చేయించుకుంటాడు. గత కొన్ని రోజులుగా అశ్విన్ పడుతున్న కష్టం చూస్తున్నాను. శివం భజే పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!