సౌందర్య కన్నడ కస్తూరీ అయినా తెలుగమ్మాయిగానే రిజిస్టరైంది. అనుష్కను మన స్వీటీ అంటూ ఓన్ చేసుకున్నారు ఇక్కడి ఆడియన్స్. ఇక రష్మికను నేషనల్ క్రష్ ట్యాగ్ ఇచ్చి టాప్‌లో కూర్చొబెట్టారు. నెక్ట్స్ టాలీవుడ్ గర్ల్‌గా స్థిరపడే ఆ శాండిల్ వుడ్ చిన్నది ఎవరు..? ఆ ఇద్దరు భామలకే ఆ ఛాన్స్ ఉందని అంటున్నారు. అనుష్క, రష్మిక, పూజా పేరుకు కన్నడ కస్తూరీలే అయినా.. టాలీవుడ్లోనే వీళ్లు ఫేమస్. కర్ణాటక వీరికి జన్మనిచ్చిన ప్రాంతమైతే కావొచ్చేమో కానీ.. వీరికి యాక్ట్రెసెస్గా పునర్జన్మను ప్రసాదించింది మాత్రం తెలుగు ఇండస్ట్రీనే. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో తెలుగు అమ్మాయిగా మారిన బ్యూటీ మన స్వీటీ అనుష్క. సూపర్‌తో మొదలైన ఆమె ప్రయాణం.. ఇప్పుడు ఘాటీ వరకు కొనసాగుతోంది. సౌత్‌కే క్వీన్‌ను చేసింది. పొడుగు కాళ్ల సుందరి పూజాకు క్రేజీ ఆఫర్లతో పాటు స్టార్ డమ్ కట్టెబెట్టింది కూడా టీటౌనే. కానీ టాలీవుడ్ గర్ల్ ట్యాగ్ వద్దనుకుని వదిలేస్తోంది.
Also Read:Mark: ఆసక్తికరంగా కిచ్చా సుదీప్ “మార్క్” టైటిల్ గ్లింప్స్
ఛలో అంటూ కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్లోకి దూసుకొచ్చిన రష్మికను నేషనల్ క్రష్ చేసిన ఘనత మనదే. వరుస ఆఫర్లతో పాటు హిట్స్ ఇచ్చి సౌత్ టు నార్త్ టాప్ హీరోయిన్గా కూర్చొబెట్టారు. కృతి శెట్టి, నేహా శెట్టిలు ఇక్కడి ఆడియన్స్‌కు చేరువయ్యారు. కానీ వీళ్లంతా కాదు. ఇలా కన్నడ కస్తూరీలు ఇచ్చిన స్పూర్తితో ఎంతో మంది భామలు.. తెలుగుమ్మాయిలుగా స్థిరపడేందుకు ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరారు రుక్మిణీ వసంత్, శ్రీనిధి శెట్టి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, హిట్3తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఈ భామలు.. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఫోకస్ చేస్తున్నారు
Also Read:Baaghi 4: థియేటర్లకు రప్పించేందుకు టికెట్స్‌పై 50 పర్సెంట్ ఆఫ్
ఫస్ట్ ఫిల్మ్ ప్లాపైనా సరే.. నెక్ట్స్ గట్టి ఫిల్మే పట్టేసింది రుక్మిణీ. ఎన్టీఆర్-నీల్ చిత్రంలో ఆమె ఫీమేల్ లీడ్ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక శ్రీనిధి మెల్లిగా ఎలాగోలా బతికేయడానికి రాలేదు.. టాలీవుడ్ గర్ల్ ట్యాగ్ తీసుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. హిట్3తో హిట్టు అందుకున్న ఈ భామ.. నెక్ట్స్ తెలుసుకదాతో రాబోతుంది. అలాగే త్రివిక్రమ్- వెంకీ సినిమాలో ఆల్మోస్ట్ శ్రీనిధినే ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. మరీ ఈ ఇద్దరు భామల్లో నెక్ట్స్ టాలీవుడ్‌ను రూల్ చేసే శాండిల్ వుడ్ క్వీన్ ఎవరౌతారో..? వీళ్లను ఇక్కడ అమ్మాయిలుగా ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ..