బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి గురించి పరిచయం అక్కర్లేదు..‘గోల్ మాల్’, ‘సింగం’ సిరీస్‌లతో మంచి పాపులరిటి దక్కించుకున్నాడు. ముఖ్యంగా ‘సింగం’ తో కాప్ యూనివర్స్‌ను క్రియేట్ చేసి, ఇప్పటికే పలు చిత్రాలను తెరకెక్కించారు . లాస్ట్ ఇయర్ ‘సింగం ఎగైన్’ సినిమాతో హిట్టు కొట్టిన రోహిత్.. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమాల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రోహిత్.
Also Read: Coolie : సూపర్ స్టార్ మూవీ కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన శ్రుతి హాసన్
తెలుగు సినిమా అంటే ఒకప్పుడు ప్రాంతీయ చిత్రం.. కానీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో, వరల్డ్ క్లాస్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ.. తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. అందుకే ఇండియా మొత్తం చూపు ప్రజంట్ టాలీవుడ్ పైనే ఉంది. తెలుగు సినిమాలు చూసి ఇతర ఇండస్ట్రీల ఫిలిం మేకర్స్ అందరూ నోర్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఏ సినిమాలు చూసినప్పుడు మీరు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది అనే భావన కలిగింది? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రోహిత్ స్పందిస్తూ.. ‘చాలా సినిమాలు ఉన్నాయి.. కానీ ‘బాహుబలి’ ‘కల్కి 2898 AD’ సినిమాలు చూసినప్పుడు అనిపించింది. ‘కల్కి’ నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్ చాలా స్పెషల్‌గా అనిపించింది. నేను నా భార్య కొడుకుతో కలిసి ఆ సినిమాకి వెళ్లాను. వాళ్లిద్దరికీ కూడా సినిమా చాలా నచ్చింది అని తెలిపారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన సినిమాలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉండడం విశేషం.