కాంతార ప్రీక్వెల్‌గా రూపొందించబడిన కాంతార చాప్టర్ 1 అనేక రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి ఒక పక్క హీరోగా నటిస్తూ, మరో పక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటించింది. జయరాం, గుల్షన్ దేవయ్య వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అన్‌స్టాపబుల్ అన్నట్టుగా దూసుకుపోతోంది.
Also Read : Divvela Madhuri : శ్రష్టి వర్మకు నాకు ఉన్న తేడా అదే.. మాధురి కామెంట్స్
ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయి 11 రోజులు పూర్తయింది. అందులో పది రోజులకు గాను ఈ సినిమా ఏకంగా 655 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కన్నడ సినీ పరిశ్రమలో అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టే సినిమాల్లో టాప్ లిస్టులో చేరింది. ఇక, ఈ సినిమా ఈజీగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 1000 కోట్ల టార్గెట్‌తో రంగంలోకి దించబడిన ఈ సినిమా ఇప్పటికే 65% వరకు టార్గెట్ పూర్తి చేసుకుందని చెప్పొచ్చు. ఇక, ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నడ హొంబాలే ఫిలింస్ సంస్థ నిర్మించింది.