Site icon NTV Telugu

Rishab Shetty: ఎన్టీఆర్ హీరోయిన్‌కు రిషబ్ శెట్టి షాక్.. ‘కాంతార’లో అసలేమైంది?

Rishab Shetty, Rukmini Vasanth, Kantara, Raj B Shetty,hombale Films

Rishab Shetty, Rukmini Vasanth, Kantara, Raj B Shetty,hombale Films

‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కన్నడ స్టార రిషబ్ శెట్టి, తాజాగా సోషల్ మీడియాలో చేసిన కొన్ని మార్పులు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రెండురోజుల క్రితం కాంతార నిర్మాణ సంస్థ హోంబలె ఫిల్మ్స్‌ను ఖాతాను అన్‌ ఫాలో చేసిన రిషబ్‌.. ఇప్పుడు తన సన్నిహిత కో స్టార్‌తో పాటు, కాంతార హీరోయిన్‌ను అన్‌ఫాలో చేయడం హాట్ టాపిక్‌గా మారింది. రిషబ్ శెట్టి తన అత్యంత సన్నిహితుడైన నటుడు రాజ్ బి. శెట్టితో పాటు, రుక్మిణి వసంత్‌ను కూడా అన్‌ఫాలో చేశారు. కాంతార సినిమాలో రుక్మిణి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ‘కాంతార’ టీమ్‌లో రిషబ్ శెట్టి, అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ వస్తున్నాయి.

Also Read: Prabhas: ఆల్ ఆన్ ట్రాక్.. ‘సలార్ 2’ ఒక్కటే డిసప్పాయింట్!

ఇప్పుడు రిషబ్ శెట్టి అన్‌ఫాలో చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే, హోంబలే ఫిల్మ్స్ సంస్థను అన్‌ఫాలో చేసినప్పటికీ, ఆ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ వ్యక్తిగత ఖాతాను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. దీనిని బట్టి చూస్తుంటే, సమస్య కేవలం ప్రొడక్షన్ హౌస్ మేనేజ్‌మెంట్‌తో ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకు ఈ వివాదంపై అటు రిషబ్ శెట్టి కానీ, ఇటు నిర్మాణ సంస్థ కానీ ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఈ సోషల్ మీడియా గొడవలు ఇలా ఉంటే, రిషబ్ శెట్టి తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు రుక్మిణి వసంత్, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉంది.

Exit mobile version