ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. అందులో భాగంగానే రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే ని పురస్కరించుకొని ‘మురారి ‘ సినిమాను రిలీజ్ చేశారు. రీరిలీజ్ లో కూడా ఈ సినిమా రికార్డు వసూళ్లు నమోదు చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఇంద్ర సినిమా చాలా ప్రత్యేకం. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు మీద రికార్డులు నమోదు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. జులై 24 నాటికి ఈ సినిమా రిలీజ్ అయి 22 ఏళ్ళు కంప్లిట్ అయింది. వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు ఇంద్ర సినిమాను గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నాం.” అంటూ వైజయంతీ మూవీస్ ప్రకటించింది.
అన్నయ దారిలోనే మెగా బ్రదర్ సినిమా కూడా రానుంది. పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాప్ లకు బ్రేక్ వేస్తూ సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం గబ్బర్ సింగ్. అప్పట్లో ఈ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రానున్న సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా గబ్బర్ సింగ్ మరోసారి థియేటర్లలో రచ్చ చేయబోతున్నాడు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యే గా గెలవడంతో పాటు,పవన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. దింతో గబ్బర్ సింగ్ రీరిలీజ్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేసారు. పది రోజుల గ్యాప్ లో మెగా బ్రదర్స్ సినిమాలు రీరిలీజ్ కానుండడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.