పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఆమె ప్రయాణం ఎంత ప్రత్యేకమో, తల్లిగా ఆమె జీవితం అంతగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇటీవల ఆమె రెండో పెళ్లి పై చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో నటి రేణూ దేశాయ్ తన జీవితంలో రెండో పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అనే విషయంపై తాజాగా స్పష్టత ఇచ్చారు.
Also Read : Sekhar Kammula: ఇంతవరకూ వారితో తిట్లు పడలేదు– శేఖర్ కమ్ముల
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ‘ఇంకొన్ని సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటాను. ఇప్పటివరకు పిల్లల కోసమే పెళ్లి చేసుకోలేదు. వాళ్లు చిన్నవాళ్లు ఉండగా, నేను మరో పెళ్లి చేసుకుంటే వారు ఒంటరితనంతో బాధపడతారని అనిపించింది. వాళ్లు పెద్ద వాళ్ళు అవుతున్నారు. మమ్మీ, నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో వాళ్లని పెళ్లి చేసుకో అని అకీరా, ఆధ్య చెప్పారు. వాళ్ల మద్దతు నాకు ధైర్యం ఇచ్చింది. వాళ్లే నన్ను మ్యారేజ్ చేసుకోమని ప్రోత్సహించడం నా హృదయాన్ని తాకింది. వాళ్లు కాలేజ్‌కి వెళ్తారు. అప్పుడే వాళ్లకి కొత్త ప్రపంచం మొదలవుతుంది. వాళ్లు కూడా తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడలేరు. అప్పుడు నేను నా జీవితాన్ని కొత్తగా ప్రారంభించగలను’ అంటూ తెలిపింది రేణూ దేశాయ్. దీంతో ఆమె రెండో పెళ్లి విషయంలో తీసుకున్న తీరుకు, చెప్పిన మాటలకు నెటిజన్లు, అభిమానులు మంచి స్పందన ఇస్తున్నారు. నిజాయితీగా, బాధ్యతతో ఆమె చెప్పిన ప్రతి మాట నేరుగా హృదయానికి తాకుతున్నాయి.