పండగకు సినిమాల విడుదల అంటే నిర్మాతలకు కాసింత ఆనందం. టాక్ కొంచం అటు ఇటు ఉన్న లాగేస్తుంది, కలెక్షన్లు రాబడతాయి అని నమ్మకం, అది గతంలో ప్రూవ్ అయింది కూడా. ఎప్పుడో వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కోసం ఇప్పటి నుండే కర్చీఫ్ లు వేసి ఉంచారు నిర్మాతలు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు పండుగ రోజుల్లో రిలీజ్ కోసం ఎంతగా ఇంట్రెస్ట్ చూపిస్తారో హీరోలు, నిర్మాతలు. ఈ ఏడాది ముఖ్యమైన పండగలకు స్లాట్స్ నిండిపోయాయి.
ఆగస్టు 15న ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్, #35 వంటి చిన్న, పెద్ద 4 సినిమాలు విడుదల అవబోతున్నాయి. వినయాక చవితి నాడు విజయ్ నటించిన G.O.A.T తో పాటు దుల్కర్ సల్మాన్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ లక్కీ భాస్కర్ పోటీపడనున్నాయి. మరోవైపు దసరా కోసం తారక్ దేవర, కంగువ పోటీ పడనున్నాయి. తాజాగా ఇప్పుడు దీపావళి విడుదలకు రేస్ మొదలైంది.
ముందుగా ఈ రేస్ లోకి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వచ్చి చేరాడు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో మెకానిక్ రాకి అనే చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్ సేన్. రవితేజ ముళ్ళపూడి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించింది నిర్మాణ సంస్థ. దీపావళి కానుకగా అక్టోబరు 31న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేశారు. కాగా ఈ సినిమా ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్, సురేష్ సంస్థలు కొనుగోలు చేశారు. పండగ నాటికి ఈ రేస్ లోకి ఇంకెన్ని సినిమాలు వచ్చి చేరతాయో ఏవి కలెక్షన్లు సాధించి హిట్ గా నిలుస్థాయో చూడాలి.
Also Read: Darling : కంటెంట్ పై నమ్మకం..ఒక రోజు ముందే స్పెషల్ ప్రీమియర్స్..