Prabhas : మరో స్టార్ దర్శకుడితో మొదలెట్టిన రెబల్ స్టార్..!
- రాజాసాబ్ షూటింగ్ లో ప్రభాస్ బిజిబిజీ
- రూ.1000 కోట్లు దాటిన కల్కి
- 26వ చిత్రానికి డార్లింగ్ గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ “కల్కి 2898 ఎడి”. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించిన కల్కి భారీ వసూళ్లు అందుకొని దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా దిశా పటాని నటించింది. విడుదలై మూడు వారాలు దాటి నాలుగో వారంలోకి అడుగుపెట్టి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
కాగా ప్రస్తుతం రెబల్ స్టార్ రాజా సాబ్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రన్ని నిర్మిస్తోంది. స్టార్ డైరెక్టర్ మారుతీ రాజాసాబ్ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు చేపడుతున్నారు. థమన్ సంగీత దర్శకునిగా వ్యయవహరిస్తున్నాడు. రాజా సాబ్ సెట్స్ పై ఉండగానే ప్రభాస్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సీతారామం చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన హను రాఘవ పూడి రెబల్ స్టార్ తో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కథ చర్చలు ఇటీవల ముగిసాయి. బౌండెడ్ స్క్రిప్ట్ ను హనురాఘవపూడి ప్రభాస్ కు వినిపించగా పచ్చజెండా ఊపాడు. స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా చిత్రంగా రానుంది . రెబల్ స్టార్ కు జోడిగా కొత్త హీరోయిన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు హను రాఘవాపుడి. అక్టోబరు నుండి ఈ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. మైత్రి మూవీస్ నిర్మించబోయే ఈ సినిమాకు “ఫౌజి” (Fauji) అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..