రెబెల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజాసాబ్ షూట్ లో పాల్గొంటున్నాడు. తాజాగా సాంగ్స్ షూటింగ్ కోసం యూరప్ వెళ్ళింది యూనిట్. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరొక క్రేజీ డైరెక్టర్ హనురాఘవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సరికొత్త ప్రభాస్ ను చూడబోతారు అని యూనిట్ చెప్తోంది. ఈ రెండింటితో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2, నాగఅశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2 ఉండనే ఉన్నాయి.
Also Read : Tollywood Actress : తెలుగులో వరుస హిట్స్.. హిందీలో వరుస ప్లాప్స్
అయితే ఇప్పుడు రెబల్ స్టార్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. ఇది ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను భయపెడుతోంది. అందుకు కారణం దర్శకుడు రాధాకృష్ణ కుమార్. జిల్ సినిమాతో డైరెక్టర్ గా మారిన రాధాకృష్ణ ఆ సినిమా మేకింగ్ పరంగా మంచి మార్కులే రాబట్టాడు కానీ సినిమా బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. వాస్తవానికి ఈ సినిమా ప్రభాస్ చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ సూచనా మేరకు ఈ సినిమాను గోపిచంద్ హీరోగా తెరకెక్కించాడు. జిల్ వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత రాధేశ్యామ్ అనే పాన్ ఇండియా సినిమాను ప్రభాస్ తో తెరకెక్కించాడు. భారీ అంచనాలు, భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. రెబల్ స్టార్ ను పెట్టుకుని ఒక్క ఫైట్ కూడా పెట్టకుండా సినిమా తీసిన రాధాకృష్ణపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఇప్పుడు రాధాకృష్ణ మరోసారి రెబల్ స్టార్ కు కథ చెప్పగా అందుకు ప్రభాస్ కు ఒకే చెప్పాడట. ఇప్పడు రాధాకృష్ణతో సినిమా అవసరమా డార్లింగ్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.