టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను 4K క్వాలిటీలో మరోసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాలు రీరిలీజ్ లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఈ మధ్య రిలీజైన పవర్ స్టార్ గబ్బర్ సింగ్, అలాగే మహేశ్ మురారి, తారక్ సింహాద్రి సినిమాలూ రీరిలీజ్ లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి. రీరిలీజ్ తో పాటుగా విడుదలైన కొత్త సినిమాల కంటే కూడా రిరిలీజ్ సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తున్నాయి.
Also Read : SSMB 29 : రాజమౌళి – మహేశ్ బాబు సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..?
ఇదే అదునుగాగ్ అనేక తమిళ డబ్బింగ్ సినిమాలు సైతం రీరిలీజ్ అవుతున్నాయి. తాజాగా ధనుష్ నటించిన ‘3’ సెప్టెంబరు 14న రిలీజ్ అయి సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ రీరిలీజ్ ల పర్వం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. వచ్చే వారం టాలీవుడ్ లో అనేక సినిమాలు మరోసారి రిలీజ్ అయ్యేందుకు రెడీ ఉన్నాయి. వాటిలో రజనీకాంత్, శంకర్ ల సూపర్ హిట్ సినిమా శివాజీ – సెప్టెంబర్ 20, శర్వానంద్ తమిళ డబ్బింగ్ సినిమా జర్నీసెప్టెంబర్ 21, సిద్దార్ధ్, జెనిలియా బొమ్మరిల్లు – సెప్టెంబర్ 21, మాస్ మహారాజ రవితేజ శ్రీనువైట్ల వెంకీ – సెప్టెంబర్ 21 రిలీజ్ కు రెడీ అయ్యాయి. వీటిలో వెంకీ, శివాజీ గతేడాది రీరిలీజ్ అయి తాజాగా మరోసారి రీరిలీజ్ అవుతున్నాయి. మరి ఒకప్పుడు సూపర్ హిట్లు గా నిలిచిన ఈ సినిమాలు రిలీజ్ లో ఎటువంటి కలెక్షన్స్ సాదిస్తాయో చూడాలి. వీటితో పాటుగా కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఖడ్గం ఆక్టోబరు 2న రిలీజ్ కు రెడీగా ఉంది.