తెలుగు సినిమా రంగంలో సూపర్‌హిట్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రవిరాజా పినిశెట్టి. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు విజయవంతమైన కెరీర్‌ను కొనసాగించారు. యముడికి మొగుడు, జ్వాల, దొంగ పెళ్లి, చంటి, బంగారు బుల్లోడు, కొండపల్లి రాజా, బలరామకృష్ణులు, యం ధర్మరాజు ఎంఏ, పెదరాయుడు, మా అన్నయ్య, వీడే.. వంటి సుమారు నలభై కి పైగా సూపర్ హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రవిరాజా పినిశెట్టి తన పెద్ద కుమారుడు సత్య ప్రభాస్ పినిశెట్టి సినీ కెరీర్‌పై ఓపెన్‌గా వ్యాఖ్యానించారు.
Also Read : Breastfeeding-benefits : డెలివరీ తర్వాత చనుబాలు ఇస్తే బరువు తగ్గుతారా? వైద్యులు ఏం అంటున్నారంటే..
“నా పెద్ద కొడుకు సత్య ప్రభాస్ దర్శకుడు కావాలని అనుకున్నాను. అందుకే రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పంపించాను. అదే నా తప్పు అయింది. వర్మ మా వాడితో ‘‘ఎవరి దగ్గర పని చేయడం ఎందుకు, దర్శకత్వం అనేది ఎవరి దగ్గర నేర్చుకునేది కాదు. సినిమాలు ఎక్కువగా చూడు, నీ నాన్న దర్శకుడు. నీకు అనిపించిన కథతో నేరుగా సినిమా తీయి. ఒకరి దగ్గర వర్క్ చేసి టైమ్ వేస్ట్ చేసుకోకు’’ అని బ్రెయిన్‌వాష్ చేసి పంపించేశాడు’ అని రవిరాజా తెలిపారు. ఇక్కడ వర్మ మాటలు సత్య ప్రభాస్ పై చాలా బాగా పని చేశాయట. అలా ఆయన ‘మలుపు’ అనే మూవీ (2015)ను తెరకెక్కించాడు. కామెడీ, మిస్టరీ, థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆది పినిశెట్టి రవిరాజా రెండో కుమారుడు. ఆది గురించి ఇక పరిచయం అక్కర్లేదు.