Site icon NTV Telugu

Jayam Ravi: సీక్రెట్ పెళ్లిపై పెదవి విప్పిన జయం రవి

Kenishaa Francis

Kenishaa Francis

రవి మోహన్‌గా పేరు మార్చుకున్న జయం రవి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో తెలుగులో కొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ రవి మోహన్. ఈ మధ్యకాలంలో భార్యతో విడాకుల వ్యవహారం కారణంగా ఆయన పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది.

Also Read:‘Lucky’ Dulquer : నిజంగానే లక్కీ దుల్కర్!

తమిళంలో కొన్ని సాంగ్స్ పాడి పాపులర్ అయిన కెనిషా అనే ఒక సింగర్ కారణంగా తన భర్త తనను వదిలేస్తున్నాడని ఆయన భార్య ఆరోపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే, వీరిద్దరూ కలిసి కనిపిస్తూ ఉండడంతో అది నిజమేనేమో అని అందరూ భావిస్తున్నారు. ఈ మధ్య వీరిద్దరూ మెడలో దండలతో ఒక గుడిలో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా విడాకులు తీసుకోలేదు కాబట్టి రహస్యంగా పెళ్లి చేసుకున్నారేమో అనే వార్తలు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం మీద రవి మోహన్ స్పందించాడు.

Also Read:NTR-Neel : 2వేల మందితో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..

ఇది కేవలం ఒక పూజ సందర్భంగా తీసుకున్న ఫోటోలని చెప్పుకొచ్చాడు. తాను ప్రారంభిస్తున్న కొత్త ప్రొడక్షన్ హౌస్ ఏర్పాట్లలో భాగంగా తీసిన పూజలో ఈ ఫోటోలు దిగామని చెప్పుకొచ్చాడు. ఇక తన పార్టనర్‌గా ఫీల్ అయ్యే కెనిషా తనతో పాటు గుడికి వచ్చిందని, ఇందులో పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కెనిషా ఫ్రాన్సిస్ ఓ క్రిస్టియన్.

Exit mobile version