Ravi Kishan Sensational Comments on Tirumala Laddu Controversy: తిరుపతి బాలాజీ ఆలయంలోని లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫాట్ వినియోగానికి సంబంధించి అనేక ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై అందరిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది కేవలం లడ్డూకి సంబంధించిన విషయం కాదు, ఇది ప్రసాదానికి సంబంధించిన విషయం. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం కావడంతో అధికార కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ అంశం మీద గోరఖ్‌పూర్ ఎంపీ, సినీ నటుడు రవికిషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన మహంత్ అవేద్యనాథ్ వర్ధంతి వారోత్సవాల కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న ఆయన.. తిరుమల లడ్డూ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
RK Roja: అవన్నీ వెంటనే డిలీట్ చేయండి.. ఆర్కే రోజా హెచ్చరిక
రవికిషన్ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బాలాజీ గుడిలో బీఫ్ లడ్డు ఇస్తున్నారు, ఈ ప్రసాదాలు హిందువులకు ఇస్తున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది హిందువులారా శాస్త్రాలు కాదు, శస్త్రాలు పట్టండి అంటూ ఆయన పిలునిచ్చారు. ఇక తిరుమల లడ్డూ తయారయేలో కల్తీ జరిగిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గుజరాత్‌కు చెందిన ల్యాబ్ రిపోర్టులో కూడా ఇది నిర్ధారించబడింది. ఈ లడ్డూలను తయారు చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె ఉన్నట్లు నివేదికలో తేలింది. దీనికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే బాధ్యత వహించించాలని పేర్కొనగా అవేవీ నిజం కాదని గత ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.