తెలుగు సినీ రచయిత అబ్బూరి రవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ కి అత్యంత సన్నిహితుడైన అబ్బూరి రవి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన నువ్వే నువ్వే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన ఆయన తర్వాత ఎలా చెప్పను అనే సినిమాతో రచయితగా మారాడు. తర్వాత తెలుగులో భగీరథ, బొమ్మరిల్లు, అన్నవరం, అతిధి సహా ఊపిరి, హైపర్, గూడచారి, ఎవరు, మేజర్ లాంటి సినిమాలకు కథా రచయితగా స్క్రీన్ ప్లే రచయితగా అలాగే డైలాగ్స్ రచయితగా కూడా పనిచేశారు.
Amit Shah: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా ట్వీట్.. నక్సలిజం చివరి దశలో ఉందని వెల్లడి!
ప్రస్తుతం ఆయన డెకాయిట్ అనే సినిమాకి డైలాగ్స్ అందిస్తూ స్క్రీన్ పై గైడెన్స్ కూడా అందిస్తున్నారు. అయితే ఆయన సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక పోస్ట్ ఇపుడు వైరల్ అవుతుంది. నేను ఇక ఆపేస్తాను ఇక చాలు అని అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు. అయితే ఆయన ఏ విషయంలో ఈ విధంగా కామెంట్ చేశారు అనే విషయం మీద ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. ఆయన నటుడిగా కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించారు. ఆయన బొమ్మరిల్లు సినిమాకు అందించిన డైలాగ్స్ కి గాను బెస్ట్ డైలాగ్ రైటర్ గా నంది అవార్డు సైతం అందుకున్నారు.
I may Quit. #Enough
— abburi ravi (@abburiravi) January 20, 2025