అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2సినిమా ఎట్టకేలకు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా హీరోయిన్ రష్మిక తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూసింది. నిజానికి రష్మిక ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెకండ్ పార్ట్ లో కూడా రష్మిక అత్యద్భుతంగా నటించింది అనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Pushpa 2: అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. పోలీసుల రియాక్షన్ ఇదే..
ఈరోజు హైదరాబాదులోని మహేష్ బాబుకు చెందిన ఏఎంబి మాల్ లో విజయ్ దేవరకొండ తల్లితో పాటు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి రష్మిక ఈ సినిమా వీక్షించింది. నిన్న కూడా ఆమె థియేటర్ విజిట్స్ కి వెళ్లారు. ఇక పుష్ప సినిమాలో ఆమె శ్రీవల్లి అనే పాత్రలో అల్లు అర్జున్ భార్య గా నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్రకు గాను ముందు నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమె మీద ప్రశంసలు వర్షం కురిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక తన మీద కురుస్తున్న ప్రశంసల జల్లు ని ఎంజాయ్ చేస్తోంది. తనమీద ప్రశంసలు కురిపించిన అందరికీ థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.