తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో సత్తా చాటుతూ, వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మరోసారి ఓ బోల్డ్ హై-ఫ్యాషన్ లుక్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తాజాగా ఆమె డర్టీ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Also Read : Chiranjeevi – అనిల్ రావిపూడి మూవీ నుంచి మరో మెగా షాకింగ్ సర్ప్రైజ్!
ఇప్పటివరకు చూసిన రష్మికను మరిచిపోండి. ఈసారి ఆమె కర్లీ హెయిర్, డార్క్ మేకప్, ఎడ్జీ స్టైలింగ్‌తో అందరినీ కంగారుపరిచింది. ‘డర్టీకట్ 2025’ అనే స్పెషల్ ఎడిషన్ కోసం ఆమె చేసిన ఈ లుక్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు..‘ఇది రష్మికేనా?’,‘మల్లన్న సినిమాలో శ్రియ లుక్‌లా ఉంది!’.. అంటూ ట్రోల్ చేయగా, మరికొందరు‘ అద్భుతంగా ఉంది. ఆమె ప్రయోగ ధైర్యానికి హ్యాట్సాఫ్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో కొత్తదనాన్ని స్వీకరించడంలో రష్మిక ముందు వరుసలో నిలిచిందనడంలో సందేహం లేదు.
ఇక ప్రజంట్ రష్మిక నటిస్తున్న తాజా చిత్రం ‘మైసా’. ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే రిలీజ్ అయింది. ముఖం నిండా రక్తం, చేతిలో ఆయుధంతో ఆమె చూపించిన వీరంగన లుక్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఈ చిత్రానికి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తుండగా, అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. రష్మిక ఈ పాత్రతో నటిగా మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. ఇటివల ‘కుబేర’ వంటి సినిమాలు రష్మికను కథానాయికగా నిలబెట్టాయి. ఇప్పుడు ఆమె ఫోకస్ పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల పైనే ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తోంది.