Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయినఈ కన్నడ భామ ఆ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.ఈ సినిమా హిట్ తో రష్మికకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి.ఈ భామ వరుసగా తెలుగుతో పాటు తమిళ్ ,కన్నడ భాషల్లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ వరుస సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో తన నటనతో అదరగొట్టింది.ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ హిట్ కావడంతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ అయింది.ఈ భామ గత ఏడాది రణ్ బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇలా భాష తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వరుసగా హిట్స్ అందుకుంటుంది.ప్రస్తుతం ఈ భామ లైనప్ లో వరుస సినిమాలు వున్నాయి.అందులో ఒకటి అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 ,అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ‘కుబేర’.. రష్మిక ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్‌లో మరో రెండు క్రేజీ సినిమాలకు కమిట్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా శిబిచక్రవర్తి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసింది. ఇది కేవలం రష్మిక మాత్రమే చేయగలిగిన పాత్ర అని, అందుకే ఆమెను కలిసినట్లు దర్శకుడు శిబిచక్రవర్తి తెలిపారు.